P Gannavaram: గోదావరి వరద ఉధృతి కోనసీమలో నిలిచిన లంక గ్రామాల రాకపోకలు!

P Gannavaram: గోదావరి వరద ఉధృతి కారణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

RAJU, P GANNAVARAM
Published on: 28 Sept 2026 11:46 AM IST
P Gannavaram
X

P Gannavaram: గోదావరి వరద ఉధృతి కోనసీమలో నిలిచిన లంక గ్రామాల రాకపోకలు!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజవర్గం. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు రాకపోకలు కు అంతరాయం ఏర్పడి పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు

పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద ఉడుముడి లంక,అరిగెలవారి పేట బూరుగులంక గంటి పెదపూడి లంక ఈ నాలుగు లంక గ్రామాల ప్రజలు గోదావరి నదిపై పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం ఎదురు బిడియం కాజ్వే పై వరద నీరు ప్రవహిస్తుండడంతో వీరవల్లిపాలెం అయినవిల్లి లంక,అద్దంకివారిలంక, మూడు గ్రామాలకు నిలచిన రాకపోకలు. మామిడి కుదురు మండలం అప్పనపల్లి కాజ్ వే పై వరద నీరు ప్రవహిస్తుండడంతో అప్పనపల్లి బి దొడ్డవరం పెదపట్నం లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM