Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరంలో గ్యాస్ లీకేజీ అధికారులు అప్రమత్తం!
Ambajipeta: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో గ్యాస్ లీకేజీ. అధికారులు అప్రమత్తం, ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ సూచన.
Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరంలో గ్యాస్ లీకేజీ అధికారులు అప్రమత్తం!
Ambajipeta: అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్నారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం మంటలు చెలరేగే అవకాశం తక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.గ్రామస్తులు ఎలాంటి భయం ఆందోళన చెందవద్దు. అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనీ జిల్లా కలెక్టర్ చూచించారు.




