Razole: రాజోలు జెడ్పీ పాఠశాలలో గ్యాస్ లీకై భారీ అగ్నిప్రమాదం!

Razole: రాజోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీ సమయంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వంట కార్మికురాలు తీవ్రంగా గాయపడ్డారు.

PRABHU, RAZOLE
Published on: 5 Oct 2026 1:24 PM IST
Razole
X

Razole: రాజోలు జెడ్పీ పాఠశాలలో గ్యాస్ లీకై భారీ అగ్నిప్రమాదం!

Razole: రాజోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం గ్యాస్ లీక్‌తో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో వంట కార్మికురాలు మంగా తీవ్రంగా గాయపడింది.

ప్రమాదాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు తరగతి గదులకు వ్యాపించకపోవడంతో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE