Rajahmundry: నేటితరం నాయకులకు జీఎంసీ బాలయోగి ఆదర్శం.. గన్ని కృష్ణ!
Rajahmundry: రాజమండ్రి కంబాలచెరువు పార్కులో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ.
Rajahmundry: నేటితరం నాయకులకు జీఎంసీ బాలయోగి ఆదర్శం.. గన్ని కృష్ణ!
Rajahmundry: నేటితరం పాలకులకు దివంగత లోక్ సభ మాజీ స్పీకర్, మహామనిషి జి ఎం సి బాలయోగి నీ ఆదర్శంగా తీసుకోవాలని గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా కంబాల చెరువు పార్కులో ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బాలయోగి కాంస్య విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశి నవీన్ కుమార్,గౌతమి జీవకారుణ్య సంఘం పాలకమండలి చైర్మన్ వర్రే శ్రీనివాసరావు,మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, దళిత నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ఎన్నటికీ మరువలేని గొప్ప మహా మనిషి బాలయోగి అన్నారు.
ఆయన 76వ జయంతి కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు తరలిరావడం ఆయనలో ఉన్న మంచితనానికి నిదర్శనమన్నారు. ఆయన తమ నుంచి దూరమై 22 ఏళ్ళు గడిచినా ఆయనతో ఉన్న ప్రతిక్షణం కళ్ళ ముందు కదులుతూనే ఉంటుందని అన్నారు. లోక్ సభ స్పీకర్ గా ఎదిగినప్పటికీ సామాన్య కార్యకర్తను కూడా ఎంతో మర్యాదగా పలకరించే వారిని వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి పిలిస్తే ఢిల్లీలో ఉన్నా బయలుదేరి వచ్చేవారని గుర్తు చేశారు.
నేటి పాలకులు ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలను,కార్యకర్తల పట్ల అనుసరించాల్సిన విధానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కార్యకర్తలు పార్టీలో గౌరవాన్ని కోరుకుంటారని ఈ సందర్భంగా అన్నారు. అందుకే ఆయన ప్రతి జయంతికి, వర్ధంతికి కంబాలచెరువు పార్కులో నివాళులు అర్పిస్తామని ఆయన చేసిన అభివృద్ధిని స్మరిస్తామని పేర్కొన్నారు.
కంబాల చెరువు ప్రక్షాళనకు చేపట్టిన శ్రమదానంలో ఆయన కూడా భాగస్వామిగా నిలిచారని, అందుకే ఆయన కాంస్య విగ్రహాన్ని ఈ పార్కులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంబాల చెరువు పార్కు మళ్ళీ దుర్ఘందంగా మారిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాలకులు దానిపై దృష్టి సారించి ఆహ్లాదకరంగా మార్చాలని సూచించారు. రాజకీయ జీవితంలో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ పదవీకాలంలో మనం చేసే మంచి పనులు అనుసరించే విధానం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని గన్ని కృష్ణ అన్నారు.
సామాన్య కార్యకర్త నుండి లోక్సభ స్పీకర్ గా ఎదిగినా ఆయన ఒదిగి ఉండే గొప్ప లక్షణం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జీవకారుణ్య సంఘం పాలకమండలి చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ మల్ల వెంకట్ రాజు, పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్( కాపు), భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురగంటి సతీష్,పార్టీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య,
జక్కంపూడి అర్జున్,మాజీ కార్పొరేటర్లు తలారి ఉమాదేవి ,జవ్వాది మురళీకృష్ణ, కోరుమిల్లి విజయ శేఖర్, ఇన్నమూరి రాంబాబు,మర్రి దుర్గా శ్రీనివాస్,సింహా నాగమణి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అప్సరి, సయ్యద్ ఫయాజ్, నాయకులు ముప్పన రుద్ర,ఎల్ వి ప్రసాద్, నల్లం ఆనంద్, తలారి భగవాన్,
రాయి అప్పన్న, కెవి శ్రీనివాస్,బెజవాడ వెంకటస్వామి,వానపల్లి శ్రీనివాస్,తలారి భాస్కర్, బర్ల గిరిజ కవులూరి వెంకట్రావు,తెదేపా లీగల్ సెల్ కొమ్మర్తి బాబ్జి,నూకల శ్రీనివాస్, యర్రమోతు ధర్మరాజు, మిస్క జోగి నాయుడు,మోత నాగలక్ష్మి,రొక్కం సత్యనారాయణ తక్కశిల పూర్ణ, కరర్రి కాశి విశ్వనాధ్, పేరూరి అంజి, వారాది నాగబాబు,అప్పలరాజు, ఆర్ ఎస్ ఆర్ బ్రదర్స్, ధర్మరాజు, మాకాని లక్ష్మణరావు,, శారద, మహబూబ్ ఖాన్, దొడ్ల బాల, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




