Malikipuram: తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ‘మానవతా మూర్తులు’ ఉచిత కటింగ్ మిషన్లు!

Malikipuram: మలికిపురం మండలం బట్టేలంక కేంద్రంగా మానవతా మూర్తులు సంస్థ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్ల తొలగింపునకు ఉచితంగా కటింగ్ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది.

PRABHU, RAZOLE
Published on: 5 Nov 2026 1:12 PM IST
Malikipuram
X

Malikipuram: తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ‘మానవతా మూర్తులు’ ఉచిత కటింగ్ మిషన్లు!

Malikipuram: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక కేంద్రంగా సేవలందిస్తున్న మానవతా మూర్తులు సామాజిక సేవా సంస్థ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్ల తొలగింపునకు ఉచితంగా కటింగ్ మిషన్లు అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి కటింగ్ మిషన్‌ను బుధవారం రెడ్‌క్రాస్ సభ్యులు జంపన బుజ్జిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు.

తుఫాన్‌కు ఇళ్లపై, రహదారులపై పడిన చెట్లను తొలగించేందుకు యువత సహకారంతో ఈ యంత్రాలను వినియోగించాలని సంస్థ నిర్ణయించింది. తొలుత 5 నుంచి 10 కటింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని సంకల్పించగా, మిగిలిన యంత్రాలను ఈ వారాంతంలో సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ సేవా కార్యక్రమానికి దాతలు పెనుగొండ రాంబాబు రూ.55,000, అబ్బరాజు నాగరాజు రూ.10,501, మన్నెం లోకనాధయ్య రూ.10,500 కలిపి మొత్తం రూ.76,001 ఆర్థిక సహాయం అందించారు. ఈ నిధులను మిషన్ల కొనుగోలు, అత్యవసర సహాయక చర్యలకు వినియోగించనున్నారు.

ఈ సందర్భంగా జంపన బుజ్జిరాజు, మంగెన వెంకట నరసింహారావు మాట్లాడుతూ.. విపత్తు సమయంలో మానవతా మూర్తులు సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. యువత, ప్రజలు ఈ ఉచిత కటింగ్ మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ అధ్యక్షుడు బోనం రాజును అభినందించారు.

ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమష్టిగా కృషి చేసి తుఫాన్ దెబ్బకు అతలాకుతలమైన కోనసీమకు పూర్వ వైభవం తీసుకురావాలని సంస్థ పిలుపునిచ్చింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE