Ambajipeta: అంబాజీపేటలో హోటల్‌లో అగ్నిప్రమాదం రూ. 2 లక్షల ఆస్తి నష్టం
Ambajipeta: అంబాజీపేటలో షార్ట్ సర్క్యూట్‌తో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం. రూ. 2 లక్షల ఆస్తి నష్టం. స్థానిక యువకులు, అగ్నిమాపక సిబ్బందితో మంటల సమసింపు.
Ambajipeta: అంబాజీపేటలో హోటల్‌లో అగ్నిప్రమాదం రూ. 2 లక్షల ఆస్తి నష్టం
Ambajipeta: అంబాజీపేట శ్రీ వీరభద్ర థియేటర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక భోజనం హోటల్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా గొట్టిముక్కల రేణుకాదేవికి చెందిన రేణుక బిర్యాని-భోజనం, కర్రీ పాయింట్ హోటల్లో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి,హోటల్లో ఉన్న సుమారు రెండు లక్షల విలువ చేసే బియ్యం బస్తాలు,మసాలా సామాన్లు, మిక్సీలు, ఫ్రిజు, గ్రైండర్లు, తదితర సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ హోటల్లో టైలరింగ్ నిర్వహిస్తున్న నందం సుబ్రమణ్యంకు చెందిన కుట్టు మిషను, ఖాతాదారుల బట్టలు అగ్నిప్రమాదంలో కాలి బూడిద అయ్యాయి. అగ్నిప్రమాదం జరుగుతున్న సమయంలో జనసేన నాయకుడు మైపాల తాతాజీ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తున్న యువకులతో పాటు స్థానిక బండారు వారి వీధికి చెందిన యువకులు మంటలను అదుపు చేశారు.
అలాగే అగ్ని ప్రమాదం జరిగిన హోటల్కు ఒకవైపునున్న గణపతి కాపీ హోటల్, మరొకవైపున ఉన్న కలప కొట్టుకు మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు.మంటల వేడికి గణపతి కాఫీహోటల్ లో విద్యుత్ సర్వీసు వైర్లు పూర్తిగా కాలిపోయాయి. అనంతరం అమలాపురం అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో మంటలను అదుపు చేశారు.




