Kadiyam: కడియంలో తుఫాన్ సహాయక చర్యలు భేష్
Kadiyam: కడియం మండలంలో అర్ణబ్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పోలీస్, విద్యుత్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి చేపడుతున్న సహాయక చర్యలను ప్రజలు కొనియాడారు.
Kadiyam: కడియంలో తుఫాన్ సహాయక చర్యలు భేష్
Kadiyam: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పలు శాఖల అధికారులు, ఉద్యోగుల బాధ్యతాయుత సేవలను మనం గుర్తించాలి..అభినందించాలి.విపత్తులు సంభవించినపుడు మనల్ని భద్రంగా ఉండమని వారి ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందిస్తారు. కడియం మండలం లో అర్ణబ్ తుఫాన్ తో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం అయింది. ఈదురు గాలులతో చెట్లు కూలిపోయాయి.
విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మంగళవారం మధ్యాహ్నం నుండి ఈదురు గాలులు వేస్తూనే ఉన్నాయి. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావంతో బుధవారం ఉదయం నుండి విస్తృతంగా వర్షం కురిపిస్తునే ఉంది.అయినా పోలీస్,విద్యుత్, రెవెన్యూ,అంగన్వాడీ , పంచాయతీ రాజ్ శాఖల ఉద్యోగులు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు.
మండలం లో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆపన్నులకు ఆహారపానీయాలు అందిస్తున్నారు. విద్యుత్, పోలీస్ శాఖ ల సేవలను ప్రత్యేకంగా అభిందించాలి. జోరు వర్షం,ఈదురు గాలుల్లో కూడా వారి సేవలు కొనసాగిస్తున్నారు.. సి ఐ వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో మూడు జేసీబీల సాయం తీసుకొని రోడ్ల పై విరిగిపడిన చెట్లను తొలగించారు. నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధించారు.
ఇక విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను చక్కదిద్ది ప్రాంతాల వారిగా విద్యుత్ సరఫరా కు కృషి చేస్తున్నామని చెబుతున్నారు.తుఫాన్ వల్ల గ్రామాలకు కలిగిన అసౌకర్యాలను తొలగించి యధా స్తితిని తీసుకువచ్చేందుకు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేసే సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు..




