Etapaka: వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Etapaka: ఎటపాక మండలం గన్నవరంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి దిశానిర్దేశం చేశారు.
Etapaka: వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎటపాక: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లో వైఎస్ఆర్సిపి గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు.శనివారం ఎటపాక మండలం గన్నవరం గ్రామంలో ఆకుల దయాకర్ ఇంటి వద్ద ఆకుల వెంకట రామారావు( పెద్దోడు) అధ్యక్షతన వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి హాజరయ్యారు.ముందుగా దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఎటపాక మండల నాయకులు, కార్యకర్తలు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని, ముఖ్యంగా యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, మరియు ఆడవాళ్ళకు ఇస్తామన్న నెలకు రూ.3000 నిధి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్సిపి విజయదుందుభి మోగించాలని పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయాన్ని లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.అనంతరం మాజీ ఎంపీటీసీలు,జడ్పీటీసీ, మరియు సర్పంచులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు,మండల సోషల్ మీడియా విభాగం కమిటీ అధ్యక్షుడు గొంగడి వెంకటరామిరెడ్డి,మాజీ ఎంపీపీ కాకా కామేశ్వరి, మాజీ జడ్పీటీసీ ఉబ్బు సుస్మిత,మండల యువజన విభాగం నాయకులు తోట శశి కుమార్,మండల మహిళా అధ్యక్షులు గుడిమళ్ల నాగలక్ష్మి,మాజీ ఎంపీటీసీ అంజలి, మండల కార్యదర్శి ముక్కు కల్పన, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు చిచ్చడి రామారావు, రైతు విభాగం అధ్యక్షుడు ధారా రమేష్, గన్నవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు వీర ప్రకాష్, గన్నవరం ఎస్ఎంసి చైర్మన్ మోట వంశీ, ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షుడు కురినాల విజయ్, స్టూడెంట్ విభాగం మండల అధ్యక్షుడు రాకేష్,కుచ్చాలపాటి వెంకటేశ్వర్లు,అన్నెం జయచంద్ర రెడ్డి, సారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చింతూరు మండల పార్టీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి,చింతూరు మండలం మాజీ జెడ్పిటిసి చిచ్చడి మురళి, రంపచోడవరం మండల పార్టీ ప్రెసిడెంట్ జల్లేపల్లి రామన్న దొర మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




