Allavaram: అల్లవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీపీ అశోక్ కుమార్

Allavaram: అల్లవరం పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ తనిఖీ చేసి సైబర్ నేరాలు, గంజాయి కట్టడి, ఎన్నికల భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

SURESH, AMALAPURAM
Published on: 10 Oct 2026 9:06 PM IST
Allavaram
X

Allavaram: అల్లవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీపీ అశోక్ కుమార్

Allavaram: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని అల్లవరం పోలీస్ స్టేషన్ ను తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీపీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐ.పి.ఎస్. సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్.మరియు పోలీస్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

తనిఖీలో ముఖ్యాంశాలు:

1.పోలీస్ స్టేషన్ తనిఖీ:

అల్లవరం పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఐజీపీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని,ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు.

2.కేసుల సమీక్ష:

అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులు మరియు స్టేషన్ పరిధిలో ఉండే శాంతి భద్రత లకు సంబంధించిన విషయాలను అమలాపురం టౌన్ ఇన్స్పెక్టర్(ఇన్ ఛార్జ్ అమలాపురం తాలుకా) ను అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చారు.

3.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతమైన పోలీసింగ్ సేవలు అందిస్తూ నేర నియంత్రణలో మంచి ఫలితాలు సాధించాలని ఐజీపీ తెలిపారు.

4.CEIR టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ ని రికవరీ చేయాలని,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కేసు లను త్వరితగతిన ఛేదించాలని సూచించినారు.

5.మహిళలు,పిల్లలు పై జరిగే ఘటనలు కు సంబంధిన కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు.

6.జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాల మూలాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గంజాయి లేదా డ్రగ్స్ సేవించే వారు ను అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా ఖచ్చితంగా నిర్ధారించి,అలాగే మత్తుకు బానిసలైన వారిని గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కూడా ప్రయత్నించాలని ఎవరైనా మత్తుపదార్థాల విక్రయాలు జరిపినా,రవాణా చేసినా లేదా సేవించినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

7.పోలీస్ అధికారులు ప్రజల్లో సైబర్ నేరాల పట్ల కలగజేసే అవగాహన కార్యక్రమాల వలన డిజిటల్ అరెస్టులు,ఓటిపి ఫ్రాడ్స్ కేసులను తగ్గించాలని అని తెలియజేసినారు.

8.అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లైవ్ ఇష్యూస్ ను ఇతర డిపార్ట్మెంట్లతో కలుపుకుని,శాంతి కమిటీనల ను ఏర్పాటు చేసుకుని ఇరు వర్గాల ప్రజలతో చర్చించుకుని సమస్యను పరిష్కరించాలని సూచించినారు.

9.అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే రోడ్ మీద ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని ఇతర డిపార్ట్మెంట్ల తో కలిపి పరిశీలించి ఆ ప్రదేశంలో కావలసిన లైట్స్ ,రేడియం స్టిక్కరింగ్ మరియు స్పీడును నియంత్రించే అవరోధాలను ఏర్పాటుచేసి రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి కృషి చేయాల్సిందిగా సూచించినారు.

10.ముఖ్యమైన జంక్షన్ లలో మరియు విగ్రహాలు వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని సూచించినారు

11.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని మరియు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

12.సిబ్బందితో ముఖాముఖి*:

అమలాపురం టౌన్ ఇన్స్పెక్టర్(ఇన్ ఛార్జ్ అమలాపురం తాలుకా)మరియు అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్సై మరియు ఇతర సిబ్బందితో ఐజీపి మాట్లాడి సిబ్బంది సమస్యలు గురించి మరియు విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు అందుబాటులో ఉండటంపై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ మహేంద్ర మత్తే , అమలాపురం డీఎస్పీ T SRK ప్రసాద్,ఎస్బీ సీఐ పుల్లారావు,అమలాపురం టౌన్ ఇన్స్పెక్టర్ వీర బాబు (ఇన్ ఛార్జ్ అమలాపురం తాలుకా), అల్లవరం పోలీస్ స్టేషన్ ఎస్సై సంపత్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM