East Godavari: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపికలు విడుదల

East Godavari: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ క్రీడా ఎంపికల షెడ్యూల్ విడుదల. ఈ నెల 28 నుంచి నవంబర్ 4 వరకు వివిధ వేదికల్లో పోటీలు.

SURESH, AMALAPURAM
Published on: 26 Sept 2026 11:15 PM IST
East Godavari
X

East Godavari: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ ఎంపికలు విడుదల

తూర్పుగోదావరి: 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్‌-19 బాలబాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియాట్ అధికారి డి. విజయశ్రీ తెలిపారు.అండర్‌–19 విభాగంలో పాల్గొనే విద్యార్థులకు 01.01.2008 జనన తేదీ ప్రాతిపదికగా వయోపరిమితిని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

శనివారం స్థానిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో డీఐఓ డి. విజయశ్రీ ఆధ్వర్యంలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్‌-19 స్కూల్ గేమ్స్ వార్షిక క్రీడా క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,ఎంపిక పోటీలను ఈ నెల 28వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వివిధ క్రీడా ప్రాంగణాల్లో నిర్వహించనున్నా మన్నారు. 28వ తేదీన డీఎస్‌ఏ కాకినాడ, జెడ్పీహెచ్‌ఎస్ వాకలపూడి, జీజేసీ పిఠాపురం వేదికలుగా గట్కా,జూడో,బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తారు. 30వ తేదీన డీఎస్‌ఏ గ్రౌండ్ కాకినాడలో రగ్బీ, టెన్నిస్,తంగ్‌టా,వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్,టైక్వాండో,చెస్,వుషు పోటీలు జరుగుతాయి.

అక్టోబర్ 1వ తేదీన డీఎస్‌ఏ గ్రౌండ్ కాకినాడలో క్రికెట్, ఫుట్‌బాల్,యోగా పోటీలు నిర్వహిస్తారు.అక్టోబర్ 3వ తేదీన జీజేసీ పిఠాపురంలో ఆర్చరీ,ఫెన్సింగ్,కలరిపయట్టు, మోడ్రన్ పెంటాథ్లాన్ పోటీలు, అదే రోజు డీఎస్‌ఏ కాకినాడలో మల్లఖంబ్,జిమ్నాస్టిక్స్, షూటింగ్,స్విమ్మింగ్,సాఫ్ట్ టెన్నిస్,స్క్వాష్,సైక్లింగ్,ఖురాష్ పోటీలు నిర్వహిస్తారు.అక్టోబర్ 27వ తేదీన జి.మామిడాడ ఫ్యామిలీ క్లబ్‌లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్,నెట్‌బాల్,టేబుల్ టెన్నిస్,అక్టోబర్ 28వ తేదీన డీఎస్‌ఏ గ్రౌండ్ కాకినాడలో హాకీ, అథ్లెటిక్స్,ఖో-ఖో,హ్యాండ్‌బాల్ పోటీలు జరుగుతాయి.

నవంబర్ 2వ తేదీన అనపర్తి మండలం కొత్తూరు డా. బి.ఆర్.ఏ.సి.ఎస్.డబ్ల్యూ.ఆర్. జూనియర్ కళాశాలలో సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్,నవంబర్ 4వ తేదీన జి.మామిడాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో వాలీబాల్, కబడ్డీ,సపక్‌తక్రా పోటీలు నిర్వహించనున్నారు.ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు,పీడీలు/వ్యాయామ విద్యా బాధ్యుల ప్రయాణ, దినసరి భత్యాలను సంబంధిత కళాశాలల ప్రత్యేక ఫీజు నిధుల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు.

ఎంపికలకు నియమితులైన పీడీలు తప్పనిసరిగా అన్ని ఎంపిక పోటీలకు హాజరు కావాలని, వారి హాజరును విధి నిర్వహణగా పరిగణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అండర్‌-19 కార్యదర్శి డాక్టర్ డి. వెంకటరెడ్డి,వి.టి.సి. కళాశాల పీడీ డి.రత్నకుమార్,కాకినాడ పీడీ పి.రత్న శ్యాముల్,సోషల్ వెల్ఫేర్ పీడీ వి.సతీష్ రాజు, వేలంగి పీడీ పి.గంగాధర్ రెడ్డి, పీడీ ఎ.వి.వి.ఎస్.కె.ఆర్. సుబ్రహ్మణ్యం,పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM