Rajanagaram: చక్రద్వారబంధం పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పరిణామం!

Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి నాగవరపు తులసి త్రిమూర్తులకు పార్టీలకతీతంగా మద్దతు లభించడం హాట్ టాపిక్‌గా మారింది.

NARAYANA, RAJANAGARAM
Published on: 23 Nov 2026 7:06 AM IST
Rajanagaram
X

Rajanagaram: చక్రద్వారబంధం పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పరిణామం!

రాజానగరం: సర్పంచ్ అభ్యర్థి నాగవరపుతులసి త్రిమూర్తులకు మద్దతుగా కూటమి పార్టీల నాయకులు నామినేషన్ ర్యాలీలో పాల్గొనడంతో హాట్ టాపిక్‌ గా మారిన సర్పంచ్ ఎన్నికలు. జనసేన ఒకవైపు కూటమి.. మరోవైపు వైసీపీ.. కానీ గ్రామంలో మాత్రం సీన్ రివర్స్...కావడంతో కూటమి అభ్యర్ధిలో మొదలైన గుబులు.

కూటమి నుంచి మరో అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోతులసి త్రిమూర్తులకు మద్దతు పలికిన కూటమి నాయకులు. ఐదు పార్టీల జెండాలతో భారీ బైక్ ర్యాలీ.. 12 మంది కూటమి, వైసీపీ వార్డు మెంబర్ల అభ్యర్థులతో కలిసి శ్రీకృష్ణపట్నంలో నామినేషన్ దాఖలు చేసిన తులసి త్రిమూర్తులు.

పార్టీలకతీతంగా నామినేషన్లు ర్యాలీ సాగడంతో రాజానగరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల సందడి.. చక్రద్వారబంధం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల హడావుడితో పండుగ వాతావరణం. గ్రామ భవిష్యత్తు కోసం పార్టీలకు అతీతంగా నాయకులు ఒక్కటవడం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. గ్రామ సమస్యలే నా ప్రాధాన్యత అంటున్నతులసి త్రిమూర్తులు.

శిథిలావస్థలో ఉన్న రహదారులు, తాగునీటి సమస్య, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ. గ్రామానికి పూర్వవైభవం తీసుకొస్తానంటున్న సర్పంచ్ అభ్యర్థి నాగవరపు త్రిమూర్తులు. అన్ని పార్టీలు కలిసి గ్రామ అభివృద్ధి కోసం ఏకతాటిపై రావడంతో ఈ కలయికను మహాకూటముగా అంటున్నా గ్రామస్తులు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM