Rajanagaram: కంబాలపై తప్పుడు పోస్టులు పెడితే సహించం: బీజేపీ!
Rajanagaram: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని బీజేపీ శ్రేణులు, అభిమానులు హెచ్చరించారు.
Rajanagaram: కంబాలపై తప్పుడు పోస్టులు పెడితే సహించం: బీజేపీ!
రాజానగరం: జగ్గంపేట, రంపచోడవరం, రాజానగరం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు, కోట్లాది రూపాయలు ఆలయాల అభివృద్ధికి నిరుపేదలకు ఖర్చు చేస్తూ ఆయా ప్రాంతాల్లో బీజేపీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంబాల శ్రీనివాసరావుపై తప్పుడు పోస్టులు పెడితే సహించేది లేదంటూ బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిస్వార్థంగా సేవలందిస్తూ, సమాజ సేవ విస్తృతంగా చేస్తున్న కంబాల శ్రీనివాసరావు ఎదుగుదలను, ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో ఆయనపై నిరాధారమైన, తప్పుడు ప్రచారాలు చేస్తుండడం చాలా దారుణమని అన్నారు. దీనిపై గోకవరం, కోరుకొండ, రాజానగరం ప్రాంతానికి చెందిన బీజేపీ శ్రేణులు, అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఏపీ ఆర్ చౌదరి (బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి) పేరుతో సోషల్ మీడియాలో కంబాల శ్రీనివాసరావుపై పెట్టిన పోస్ట్ పూర్తిగా అవాస్తవం మరియు కల్పితంమని బీజేపీ శ్రేణులు, కంబాల శ్రీనివాసరావు అభిమానులు, కార్యకర్తలు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మీదట అవాస్తవాలు, అద్భుత కల్పనలతో కంబాల శ్రీనివాసరావు పై పోస్ట్ పెడితే సహించేది లేదంటూ కంబాల అభిమానులు మండిపడుతున్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆయన చేస్తున్న విస్తృతమైన సేవా కార్యక్రమాలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారనీ బీజేపీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి తన విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో సేవా తత్పరుడైన కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి మద్దతు కోరి, ఆయనకు వచ్చిన బీ-పారంతో కంబాల శ్రీనివాసరావు సమక్షంలో ఫోటోలు దిగడం జరిగిందనీ.
దీన్ని కూడా వక్రీకరించి, ఏదో పెద్ద తప్పు జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు సృష్టించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ ప్రకటనలో వారు ఖండించారు. బీజేపీ పార్టీలో కంబాల శ్రీనివాసరావుకి ఉన్న పేరును, పరువును దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారనీ.
ఇలాంటి అసత్య ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవరూ నమ్మవద్దని బీజేపీ శ్రేణులు, కంబాల అభిమానులు కోరుతున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తే, సంబంధిత వ్యక్తులపై పరువు నష్టం దావాలతో పాటు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా కార్యకర్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.




