P Gannavaram: ముంగండ పాఠశాల ఆవరణలో సగం కాలిన మృతదేహం కలకలం!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంగండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తణుకుకు చెందిన గండికోట రాంబాబు (58) సగం కాలిన మృతదేహం కలకలం రేపింది.

RAJU, P GANNAVARAM
Published on: 24 Nov 2026 10:49 AM IST
P Gannavaram
X

P Gannavaram: ముంగండ పాఠశాల ఆవరణలో సగం కాలిన మృతదేహం కలకలం!

పి గన్నవరం: పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సగం కాలిన పురుషుని మృతదేహం కలకలం రేపింది. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా తణుకు కు చెందిన గండికోట రాంబాబు వయసు 58, మృతునికి భార్య గండికోట చెల్లమ్మ వయసు 56, స్థానికంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆనుకుని చెట్ల పొదల్లో శవం కాలుతుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM