Kothapeta: గోపాలపురం పంచాయతీ పోరు.. వన్ సైడ్‌గా మారిన ఎన్నిక!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతు సర్పంచ్ అభ్యర్థి అధికారి సుభాషిని విజయం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Kothapeta: గోపాలపురం పంచాయతీ పోరు.. వన్ సైడ్‌గా మారిన ఎన్నిక!
కొత్తపేట: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం గ్రామపంచాయతీకి అధికారి సుభాషిని నాగు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక వన్ సైడ్ ఎన్నికగానే కనిపిస్తుంది. అధికారి నాగు వ్యాపారం గానే కాకుండా గోపాలపురం గ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఆయన గతంలో గోపాలపురం పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు పనిచేశారు.
ఆ తదుపరి గ్రామాన్ని అసలు పదవి లేకపోయినా వదిలిపెట్టలేదు గ్రామంలో ప్రజలకు ఎస్సీలకు బీసీలకు ఇతరులకు అవసరమైన పనులన్నీ ఆయన చూసుకునే వారిని ప్రజలే చెప్తున్నారు. దీంతో సర్పంచ్ పదవికి నిలబడిన సుభాషిని ఎన్నిక లాంచనమే తప్ప మరోటేమి కాదని రాజకీయ పరిశీలకులు తెలుపుతున్నారు.
అధికార నాగేశ్వరరావు సతీమణి సుభాషిని మంచి మెజారిటీతో గెలుపొందుతారని తొలి నుండి ప్రచారం ఉంది. కూటమి అభ్యర్థి కావడంతో తెలుగుదేశం, జనసేన తోబాటు కొన్ని సామాజిక వర్గాలు సుభాషినికి తోడుగా ఉన్నాయి. దీంతో ఆమె గెలుపు సునాయాసంగా ఉంటుందని చెబుతున్నారు.




