Alamuru: ఆలమూరు వైస్ ఎంపీపీ ఈదల రాంబాబుకు ఘనంగా శుభాకాంక్షలు!

Alamuru: కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఈదల రాంబాబును ఏపీ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వైట్ల దుర్గారావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 20 Nov 2026 1:49 PM IST
Alamuru
X

Alamuru: ఆలమూరు వైస్ ఎంపీపీ ఈదల రాంబాబుకు ఘనంగా శుభాకాంక్షలు!

ఆలమూరు, నవంబర్ 19: కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఈదల రాంబాబుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వైట్ల దుర్గారావు గారు. ఈదల రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వైస్ ఎంపీపీగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరుతూ, ఈదల రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA