Amalapuram: వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీగా దంగేటి రుద్ర!
Amalapuram: వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా దంగేటి రుద్ర నియామకం: వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు, అమలాపురం నియోజకవర్గంలో హర్షాతిరేకాలు.
Amalapuram: వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీగా దంగేటి రుద్ర!
అమలాపురం: వైసీపీ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సెక్రటరీగా దంగేటి రుద్రను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నియామకంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఆనందం వ్యక్తమయ్యాయి. రుద్రకు పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దంగేటి రుద్ర మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి,మాజీ మంత్రి విశ్వరూప్అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వైస్సార్సీపీ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పంచాయతీరాజ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రుద్ర తెలిపారు. గ్రామస్థాయిలోపార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులు,కార్యకర్తలు,అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.




