Chinturu: విఆర్ పురం ప్రధాన రహదారిపై భారీ గుంత
Chinturu: చింతూరు నుంచి విఆర్ పురం వెళ్లే రహదారిపై శబరి వరదలకు భారీ గుంత ఏర్పడింది. తక్షణమే మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Chinturu: విఆర్ పురం ప్రధాన రహదారిపై భారీ గుంత
చింతూరు: మండల కేంద్రం చింతూరు ప్రధాన సెంటర్ నుంచి శబరి ఒడ్డుకు వెళ్లే రహదారి పై పెద్ద గుంత ఏర్పడింది.ఈ గుంత వద్ద వాహనదారులు ఆదమరిస్తే అంతే సంగతులు.మొన్న సంభవించిన శబరి వరద వలన చింతూరు ప్రధాన సెంటర్ నుంచి వి ఆర్ పురం మండలానికి వెళ్లే రహదారి జలమయం అయింది.ఈ సమయంలో వరద ఉదృతంగా ప్రవహించడంతో రహదారి పై పెద్ద గుంత ఏర్పడింది.అలాగే రహదారి కోతకు గురై ప్రమాదభరితంగా మారింది.
చింతూరు నుంచి విఆర్ పురం మండలానికి వెళ్లే రహదారి కావడంతో నిత్యం ఈ రహదారిలో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాల,ఆటోలు తిరుగుతూ ఉంటాయి.
వరద తగ్గి చాలా రోజులవుతున్న ఈ రహదారి పై ఏర్పడిన గుంతను,కోతకు గురైన రహదారిని మరమ్మత్తులు చేయకపోవడంతో ఈ రహదారి పై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి పై ఏర్పడిన గుంతను పుడ్చాలని ,కోతకు గురైన రహదారిని మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.




