Razole: రాజోలులో ఎస్సీలకు జెడ్పీటీసీ, ఎంపీపీ సున్నా దళిత జేఏసీ ఆగ్రహం!
Razole: రాజోలు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపుపై దళిత జేఏసీ మండిపడింది. న్యాయపోరాటానికి హైకోర్టును ఆశ్రయించిన జడ శ్రవణ్ కుమార్.
Razole: రాజోలులో ఎస్సీలకు జెడ్పీటీసీ, ఎంపీపీ సున్నా దళిత జేఏసీ ఆగ్రహం!
రాజోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని దళిత సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎస్సీలకు కల్పించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజోలు నియోజకవర్గంలో ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా ఎస్సీలకు రిజర్వు కాకపోవడం, ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. నాలుగు మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్సీలకు ప్రాతినిధ్యం లేకపోవడం ఎస్సీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణచివేసే ప్రయత్నంగా కనిపిస్తోందని విమర్శించారు.
ఈ అన్యాయంపై జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో తన వాదనలు వినిపిస్తున్నారని, న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు దక్కకపోయినా, జనరల్ కేటగిరీ స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి తమ రాజకీయ సత్తా చాటుతామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దేవ రాజేంద్రప్రసాద్, తోటే ప్రతాప్, బత్తుల మురళీకృష్ణ, చిలకపాటి శ్రీధర్, లిఖితపూడి బుజ్జి, బొడ్డపల్లి ప్రసాద్, కాకర విశ్వనాథం, బత్తుల సరస్వతీరావు తదితరులు పాల్గొన్నారు.




