Nidadavole: సీఈఓ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలి - సీపీఎం నిరసన!
Nidadavole: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్.
Nidadavole: సీఈఓ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలి - సీపీఎం నిరసన!
Nidadavole: సిఇసి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి సీపీఎం డిమాండ్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చెదలు పట్టిందని ఆయనను తక్షణమే తొలగించాలని వామపక్షాలు ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తక్షణమే తొలగించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో మిగిలిన ఇద్దరు చెప్పిన ఏ విషయాన్ని జ్ఞానేష్ కుమార్ వినలేదని ఏకపక్షంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని రాంబాబు అన్నారు 14 సార్లు క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాసిన స్పందించలేదని ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి వ్యవస్థకు పనికిరారని ఎలాంటి వారు సీఈసీగా ఉంటే ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్యకుదేశంగా ఉన్న పార్లమెంటు వ్యవస్థకు పుట్టినిల్లుగా ఉన్న భారతదేశం ప్రజాస్వాము మనుగడ సాగించలేదని బతకదని రాంబాబు అన్నారు.
గతంలో ఎన్నికలు జరిగినా పశ్చిమ బెంగాల్లో 17 లక్షల ఓట్లను తొలగించి ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని కొనసాగించారని అది అక్కడ ప్రభావం చూపించిందని ఈ ఓట్లన్నీ దళితులు ముస్లిం మైనార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని సంఘాల్ని టార్గెట్ చేసి సిఇసి బిజెపి అండదండలతో ఈ కుట్రకు పాల్పడ్డారని రాంబాబు విమర్శించారు ప్రధాని మోడీ. అమిత్ షా ఆదేశాలతో జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల వ్యవస్థను దెబ్బతీశారని దేశంలో ఉన్న కోట్లాదిమంది భారతీయులను ఓటర్లుగా నమోదు కాకుండా తీరని అన్యాయం చేశాడని నిజమైన దేశ ద్రోహి జ్ఞానేష్ కుమార్ అని అన్నారు.
సీఈసీ ఎంపిక కమిటీలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిని తొలగించి క్యాబినెట్ ర్యాంకు మంత్రిని పెట్టారని అనంతరం ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని ఈ కుట్రను వాము పక్షాలు ఎప్పటినుండో ఎలిగితే చాటుతున్న మొండిగా ముందుకు వెళ్లారని ఇప్పుడు నిజాయితీగా ఎన్నికల కమిషన్ లోని ఇద్దరు సభ్యులు ప్రశ్నించడం ద్వారా ఇది వెలుగులోకి వచ్చిందని ఈ సమస్యను పరిష్కరించాలంటే తక్షణమే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని తొలగించాలని రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ వామపక్షాల డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్ బాబు . కె బుద్ధుడు. ప్రసాద్. దుర్గా ప్రసాద్ రాము పిట్టా దావీదు రాజు రాము తది తరులు పాల్గొన్నారు.




