Amalapuram: గాయపడిన ఉద్యోగికి కమిషనర్ కృష్ణ తేజ ఐఏఎస్ ఆర్థిక సాయం!

Amalapuram: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వీఆర్ పురం ఏపీఓకు కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ ఐఏఎస్ రూ.25,000 తక్షణ ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.

SURESH, AMALAPURAM
Published on: 10 Nov 2026 10:22 PM IST
Amalapuram
X

Amalapuram: గాయపడిన ఉద్యోగికి కమిషనర్ కృష్ణ తేజ ఐఏఎస్ ఆర్థిక సాయం!

అమలాపురం: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వీఆర్ పురం ఏపీఓకు రూ.25 వేల తక్షణ ఆర్థిక సహాయం చేశారు. ఇటువల కాలంలో రోడ్డు ప్రమాదంలో కాలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలవరం జిల్లా వీఆర్ పురం ఏపీఓకు మానవీయ దృక్పథంతో గౌరవ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, ఐఏఎస్ గారు రూ.25,000 తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పథక సంచాలకుల జి ఎస్ రాంగోపాల్ ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఉద్యోగికి అండగా నిలిచి తక్షణ సహాయం అందించడం ద్వారా మానవత్వం, ఉద్యోగుల పట్ల బాధ్యతాయుతమైన సేవాభావాన్ని చాటుకున్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM