Amalapuram: వైద్య కాంట్రాక్టు ఉద్యోగుల పోరుకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు
Amalapuram: వైద్య ఆరోగ్య శాఖలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ అమలాపురం ఏరియా ఆసుపత్రి ఎదుట దీక్ష చేపట్టగా సీఐటీయూ సంపూర్ణ మద్దతు పలికింది.
Amalapuram: వైద్య కాంట్రాక్టు ఉద్యోగుల పోరుకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు
అమలాపురం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (CHC) పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు (CITU) కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా, అమలాపురం ఏరియా ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్చేయాలి.
రెగ్యులరైజ్ చేసేంత వరకు,సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన 100% గ్రాస్ శాలరీ (Gross Salary) చెల్లించాలి.ఈ సందర్భంగా నాయకులు దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించడంలో, క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి దుర్గాప్రసాద్ పాటుగా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారేo వెంకటేశ్వరరావు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరావు గారు తదితరులు పాల్గొని కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతును తెలియజేశారు.




