Ravulapalem: రావులపాలెంలో భవానీ స్వాములకు అన్నదాన కార్యక్రమం!
Ravulapalem: రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు భిక్ష. పాల్గొని అన్నదానం చేసిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.
Ravulapalem: రావులపాలెంలో భవానీ స్వాములకు అన్నదాన కార్యక్రమం!
Ravulapalem: రావులపాలెం మహాలక్ష్మి హీరో షోరూం వద్ద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి ఆధ్వర్యంలో భవానీలకు భిక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని భవానీలకు భిక్ష వడ్డించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీలకు అన్నదానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక సేవలో భాగస్వాములయ్యారు. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది.




