Atreyapuram: వాడపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రచారం షురూ!

Atreyapuram: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి స్థానిక ఎన్నికల ప్రచారం ప్రారంభించి, ఆత్రేయపురంలో పర్యటించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 30 Oct 2026 5:42 PM IST
Atreyapuram
X

Atreyapuram: వాడపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రచారం షురూ!

Atreyapuram: ఆత్రేయపురం మండలంలో స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిర్ల జగ్గిరెడ్డి గారు ఈరోజు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రారంభించారు.

ముందుగా చిర్ల జగ్గిరెడ్డి గారు, నాలుగు మండలాలకు చెందిన జడ్పీటీసీ అభ్యర్థులు, ఆత్రేయపురం మండల ఎంపీటీసీ అభ్యర్థులు కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకుని స్థానిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆత్రేయపురం మండల జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్, మండలంలోని 17 గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి గారు వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలను కలుసుకున్నారు.గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థులు తమ పరిచయాలను తెలియజేస్తూ, స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలపై చర్చించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జడ్పీటీసీ అభ్యర్థులు, ఆత్రేయపురం మండల జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్, 17 గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA