Kothapeta: చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు!
Kothapeta: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో గోపాలపురంలో పార్టీలోకి చేరిన కొత్తపేటకు చెందిన నాయకులు.
Kothapeta: చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు!
Kothapeta: గోపాలపురం గ్రామంలో ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట సంతోష్ నగర్‌కు చెందిన చోడపనీడి సతీష్ మరియు ముద్రగడ సత్యనారాయణ (వెంకన్న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ అని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్న వారికి సముచిత గుర్తింపు, గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.




