Chinturu: స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం!

Chinturu: చింతూరు స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమన్న జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల. బుధవారం నుండి ముమ్మరంగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Oct 2026 10:23 PM IST
Chinturu
X

Chinturu: స్థానిక సమరంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం!

చింతూరు: స్థానిక సమరంలో వైఎస్ఆర్సిపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని చింతూరు వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి సవలం అమల అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ ఒక వైఎస్ఆర్సిపి నే అని అన్నారు.

పథకాలు అమలులో వైఎస్ఆర్సిపి ప్రజాదరణ పొందిందని ఈ స్థానిక సమరంలో చింతూరు మండలంలో వైఎస్ఆర్సిపి విజయదుందుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.బుధవారం నుంచి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టారు.

చింతూరు జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సవలం అమల ఈసారి కూడా జడ్పిటిసి స్థానం వైఎస్ఆర్సిపి దక్కించుకుంటుందని అన్నారు.వైఎస్ఆర్సిపి పాలనలో ప్రజలకు అన్ని సదుపాయాలు,మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందించి ప్రజా మన్ననలు పొందిందన్నారు.ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం తద్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR