Chinturu: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిచ్చడి మురళికి బ్రహ్మరథం!
Chinturu: చింతూరు-2 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిచ్చడి మురళి ఇంటింటి ప్రచారం. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి.
Chinturu: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చిచ్చడి మురళికి బ్రహ్మరథం!
చింతూరు: చింతూరు-2 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న చిచ్చడి మురళికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
బుధవారం చింతూరు-2 పరిధిలోని గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా చిచ్చడి మురళి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలోనే చింతూరు మండలంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయన్నారు.
జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, అందుకే ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని అన్నారు.
తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రచారంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




