Chinturu: చింతూరు జెడ్పీటీసీ బరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సవలం అమల హవా!
Chinturu: చింతూరు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సవలం అమల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు. ప్రజల నుంచి వస్తున్న స్పందన.
Chinturu: చింతూరు జెడ్పీటీసీ బరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సవలం అమల హవా!
చింతూరు: చింతూరు ZPTC ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సవలం అమల విజయ దుందుభి మోగించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.గతంలో MPP గా పనిచేసిన అమల, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటారని, ప్రజా సేవే పరమావధిగా పనిచేసే తత్వం ఆమె సొంతమని నాయకులు పేర్కొన్నారు.
అందుకే నేడు ప్రచారంలో ఆమె వెంట జనం బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి హయాంలో బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారని, ఆ అభిమానంతోనే అమలను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని అన్నారు.అమల గెలిస్తే మండలంలోని పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించి, చింతూరును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నారు. ఏజెన్సీలో ఫ్యాన్ గాలి వీచేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది.




