Chinturu: అధికారులు పట్టించుకోకపోతేనేం సొంత ఖర్చుతో గుంత పూడ్చిన యువకుడు!
Chinturu: చింతూరు-చట్టి రహదారిపై ప్రమాదకర గుంతను సొంత ఖర్చులతో పూడ్చిన యువకుడు షేక్ అహ్మద్ (పండు). అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ప్రశంసలు.
Chinturu: అధికారులు పట్టించుకోకపోతేనేం సొంత ఖర్చుతో గుంత పూడ్చిన యువకుడు!
Chinturu: చింతూరు చట్టి నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారి రోజూ వందలాది వాహనాలు తిరిగే రోడ్డు. కానీ ఆ రోడ్డు మధ్యలో ఓ పెద్ద గుంత చూస్తేనే భయం. ఎప్పుడు ఎవరు పడతారో తెలియని పరిస్థితి. అధికారులు చూసీ చూడనట్టు వదిలేశారు.కానీ ఒక్క యువకుడు మాత్రం చూసి ఊరుకోలేకపోయాడు. అతడే షేక్ అహ్మద్ అలియాస్ పండు.ఎవరో వచ్చి చేస్తారని ఎదురుచూడటం ఎందుకు? నా ఊరి ప్రజల ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో సిమెంట్, చిప్స్, ఇసుక తెచ్చాడు.
ఒక్కడే రోడ్డు మీదకు దిగి, చెమటోడ్చి ఆ మృత్యు గుంతను పూడ్చేశాడు.పండు చేసిన ఈ చిన్న పని ఇప్పుడు చింతూరులో పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక సామాన్య యువకుడు చేసి చూపించాడు అంటూ స్థానికులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.సమస్యను చూసి తిట్టడం కాదు పరిష్కారం కోసం ముందుకు రావడమే నిజమైన సేవ అని పండు నిరూపించాడు.




