Chinturu: చింతూరులో న్యాయం కోసం నిలబడ్డ యువగళం!

Chinturu: పోలవరం ముంపు గ్రామం చింతూరులో యువత నిరసన. ఓటు హక్కు ఇచ్చారు కానీ 18 ఏళ్లు దాటిన తమకు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇవ్వడం లేదని ఆవేదన.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 6 Nov 2026 7:44 AM IST
Chinturu
X

Chinturu: చింతూరులో న్యాయం కోసం నిలబడ్డ యువగళం!

Chinturu: చింతూరు పోలవరం ముంపు నీడలో కొట్టుమిట్టాడుతున్న గ్రామం . ఇక్కడి యువత ఇవాళ ఓటు వేసింది. కానీ ఆ ఓటు వెనుక ఓ ఆవేదన ఉంది, ఓ ఆగ్రహం ఉంది, ఓ ప్రశ్న ఉంది.18 ఏళ్లు దాటాయని మాకు ఓటు హక్కు ఇచ్చారు. మరి అదే 18 ఏళ్లు దాటిన మాకు పరిహారం ఎందుకు ఇవ్వరు ? అంటూ యువత గళం విప్పింది. పోలవరం ప్రాజెక్టు పేరుతో చింతూరు ముంపులో మునిగిపోతుందని తెలిసినా, తమ పేర్లు మాత్రం పరిహారం జాబితాలో లేవని వారు వాపోయారు. కట్ ఆఫ్ డేట్ పేరుతో తమ భవిష్యత్తును కట్ చేస్తున్నారని మండిపడ్డారు.మేము మేజర్లం. రేపు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లం. మా ఊరు మునిగితే మా బతుకు ఎక్కడ ? అని ప్రశ్నించారు.కట్ ఆఫ్ డేట్ నుంచి మూడు సంవత్సరాల లోపు పరిహారం ఇవ్వాలని, లేదంటే మళ్లీ సర్వే చేసి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలని చట్టం చెబుతోందని యువత గుర్తుచేశారు.ఓటు వేసి వచ్చిన చేతితోనే న్యాయం కోసం చేయి చాచారు. ప్రభుత్వం ఇప్పుడైనా తమ వైపు చూసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR