Chinturu: బదిలీపై వెళ్తున్న సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్‌కు ఘన వీడ్కోలు
Chinturu: చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్‌కు ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. నూతన సబ్ కలెక్టర్‌గా చిట్టపులి నరేంద్ర బాధ్యతలు.
Chinturu: బదిలీపై వెళ్తున్న సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్‌కు ఘన వీడ్కోలు
చింతూరు: చింతూరు సబ్ కలెక్టర్,ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా విధులు నిర్వహించి బదిలీ పై వెళ్తున్న శుభం నొక్వాల్ కు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో నూతనంగా చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చిట్టపులి.
నరేంద్ర పడాల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ చింతూరు సబ్ డివిజన్‌లో శుభం నొక్వాల్ సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల పరిహారం, పునరావాసం ప్యాకేజీల అమలులో భాగంగా 10,881 మంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాలు అందించడంలో, అలాగే సుమారు 6,000 ఎకరాల భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ప్రజలతో సమన్వయంతో పనిచేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో చూపిన చొరవ అభినందనీయమన్నార.నూతన బాధ్యతల్లో కూడా శుభం నొక్వల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.శుభం నొక్వల్ మాట్లాడుతూ, చింతూరు ప్రాంతంలో విధులు నిర్వహించిన కాలం తనకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించిందన్నారు.
అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల సహకారంతో పునరావాసం, భూసేకరణ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు.తనకు సహకరించిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు శుభం నొక్వల్‌ను శాలువా, జ్ఞాపికలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.




