Chinturu: దివ్యాంగుడికి భరోసా.. యువతకు ఆశగా సర్పంచ్ అభ్యర్థి నాగరాజు!

Chinturu: చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన పాయం నాగరాజు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 27 Nov 2026 8:51 AM IST
Chinturu
X

Chinturu: దివ్యాంగుడికి భరోసా.. యువతకు ఆశగా సర్పంచ్ అభ్యర్థి నాగరాజు!

చింతూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ముకునూరులో రోజురోజుకూ పెరుగుతోంది. జనసేన మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన పాయం నాగరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ, యువతతో భుజం భుజం కలిపి నడుస్తూ నాగరాజు ప్రచారం సాగుతోంది. ఎవరి ఇంటికైనా సరే... తలుపు తట్టి మరీ ఓటు అడుగుతున్న తీరు ఓటర్లను ఆకట్టుకుంటోంది.

ప్రచారంలో భాగంగా దివ్యాంగుడి వద్దకు స్వయంగా వెళ్లిన నాగరాజు, ఆయన సమస్యలను ఓపికగా విన్నారు. "మీ సమస్యే నా సమస్య... గెలిచిన వెంటనే పరిష్కారం చూపిస్తా" అంటూ భరోసా ఇచ్చారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు.

అంతేకాదు, గ్రామంలోని రచ్చబండ వద్ద కూర్చున్న యువకుల వద్దకు వెళ్లి, వారితో కలిసి గ్రామ అభివృద్ధిపై తన కలను పంచుకున్నారు. "ఈసారి యువకుడికి అవకాశం ఇవ్వండి... ముకునూరును మార్చి చూపిస్తా" అన్న నాగరాజు మాటకు యువత నుంచి భారీ స్పందన వస్తోంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR