Chinturu: చింతూరు డివిజన్‌లో వైసీపీ హవా: 3 జడ్పీటీసీలు కైవసం!

Chinturu: చింతూరు డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. 4 జడ్పీటీసీల్లో 3 స్థానాలను కైవసం చేసుకోగా, చింతూరు మండలంలో 12 ఎంపీటీసీల్లో ఏకంగా 10 స్థానాలను గెలుచుకుంది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 7 Nov 2026 7:13 PM IST
Chinturu
X

Chinturu: చింతూరు డివిజన్‌లో వైసీపీ హవా: 3 జడ్పీటీసీలు కైవసం!

చింతూరు: చింతూరు డివిజన్ లో వైసీపీ విజయఢంకా మోగించింది. ఎటు చూసినా ఫ్యాన్ గాలి.. ఎటు విన్నా ఫ్యాన్ హోరు, డివిజన్ లోని మొత్తం 4 జడ్పీటీసీ స్థానాలకు గాను 3 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. చింతూరు, ఎటపాక, వి.ఆర్.పురం మండలాల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి వైసీపీ జెండా ఎగరేసింది. ఒక్క కూనవరం లో మాత్రమే బీజేపీ బయటపడింది.

గెలిచిన సైనికులు వీరే..

చింతూరు జడ్పీటీసీ, సవలం అమల, వి.ఆర్.పురం జడ్పీటీసీ, బంధం విజయలక్ష్మి, ఎటపాక జడ్పీటీసీ, కాక కామేశ్వరి, కూనవరం జడ్పీటీసీ, పాయం వెంకయ్య (బీజేపీ)

చింతూరు మండలంలో క్లీన్ స్వీప్ కు దగ్గరగా..!

చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 10 స్థానాల్లో వైసీపీ దుందుభి మోగించింది. టీడీపీకి ఒక్కటి, బీజేపీకి ఒక్కటి మాత్రమే దక్కాయి. దీంతో చింతూరు మండలం పూర్తిగా వైసీపీ కంచుకోట అని మరోసారి రుజువైంది.

కౌంటింగ్ కేంద్రం నుండి సెంటర్ వరకు హోరెత్తిన ర్యాలీ..

ఫలితాలు వెల్లడి కాగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. కౌంటింగ్ కేంద్రం సమీపం నుండి ఎర్రంపేట, చింతూరు ప్రధాన సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. "జై జగన్.. జై వైసీపీ" నినాదాలతో చింతూరు దద్దరిల్లింది. బాణాసంచా మోతలు, డప్పు వాయిద్యాలతో సెంటర్ అంతా పండగ వాతావరణం నెలకొంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR