Chintoor: తొలి ఓటుతోనే ఎంపీటీసీగా గెలిచి ఏజీ కోడేరులో యువ సంచలనం
Chintoor: చింతూరు మండలం ఏజీ కోడేరు ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి అగరం మధు ఘన విజయం. తొలి ఓటు హక్కుతోనే పోటీ చేసి గెలిచి యువ సంచలనంగా నిలిచిన వైనం.
Chintoor: తొలి ఓటుతోనే ఎంపీటీసీగా గెలిచి ఏజీ కోడేరులో యువ సంచలనం
చింతూరు: చింతూరు మండలం ఏ.జీ. కోడేరులో ఓ అద్భుతం జరిగింది. ఓ కుర్రాడి కథ ఇప్పుడు ఊరంతా హాట్ టాపిక్ అయిపోయింది.వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీటీసీగా బరిలోకి దిగిన అగరం మధు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఘన విజయం సాధించాడు.
అసలు విశేషం ఏంటంటే... మధుకి ఇదే తొలిసారి ఓటు హక్కు రావడం ఓటు వేసే వయసు వచ్చీ రాగానే ఓట్లు అడిగి గెలిచేశాడు. తొలి ఓటు... తొలి పోటీ... తొలి గెలుపు ఇది కదా అసలు సినిమా కథ.మధు గెలుపు వార్త తెలియగానే ఏ.జీ. కోడేరులో సంబరాలు మిన్నంటాయి.
చిన్న వయసులో ఇంత పెద్ద గెలుపా? అని పెద్దలు కూడా నోరెళ్లబెట్టారు. యువతకు మధు ఇప్పుడు స్ఫూర్తిగా మారిపోయాడు. వయసు చిన్నదైనా ఆలోచన పెద్దది అని ఊరి ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు.ప్రజలు, నాయకులు మధుకి అభినందనల వెల్లువ కురిపించారు.
ఈ గెలుపు వెనుక మధు కష్టం ఉంది, ప్రజల నమ్మకం ఉంది, యువత ఆశ ఉంది. తొలి అడుగులోనే విజయం సాధించిన మధు ముందుముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏ.జీ. కోడేరు చరిత్రలో మధు గెలుపు ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని గ్రామస్తులు అంటున్నారు.




