Chintoor: దబ్బగూడెంలో దారుణం.. భర్తను కొట్టి చంపిన భార్య!

Chintoor: చింతూరు మండలం దబ్బగూడెంలో దారుణం. తాగివచ్చి వేధిస్తున్న భర్త లక్ష్మణరావును కర్రతో కొట్టి చంపిన భార్య భద్రమ్మ. కేసు నమోదు చేసిన సీఐ గోపాలకృష్ణ.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 Oct 2026 4:19 PM IST
Chintoor
X

Chintoor: దబ్బగూడెంలో దారుణం.. భర్తను కొట్టి చంపిన భార్య!

చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం దబ్బగూడెం గ్రామంలో భర్త పై కర్రతో దాడి చేసి హతమార్చిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.తెలిసిన వివరాలు ప్రకారం దబ్బగూడెం గ్రామానికి చెందిన జల్లి భద్రమ్మ అంగన్వాడి కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వహిస్తుంది.

భర్త జల్లి లక్ష్మణరావు(38) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.ప్రతి నిత్యం లక్ష్మణ్ రావు తాగి ఇంటికి రావడం భార్యా భర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.ఆదివారం రాత్రి లక్ష్మణరావు తాగి ఇంటికి వచ్చి భార్య భద్రమ్మ ను అక్రమ సంబంధాలు అంటగట్టి,అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన భద్రమ్మ లక్ష్మణ్ పై కర్రతో దాడి చేసింది.ఈ దాడిలో లక్ష్మణరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న చింతూరు సిఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్ఐ హుస్సేన్ లు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన పై విaచారణ చేపట్టారు.ఈ ఘటన పై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR