Chintoor: అయ్యప్ప మాలతో ప్రచారం.. ముకునూరులో పాయం నాగరాజు హవా!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయ్యప్ప మాలతో జనసేన, టీడీపీ, సీపీఎం మద్దతుతో బరిలోకి దిగిన పాయం నాగరాజు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 Nov 2026 4:16 PM IST
Chintoor
X

Chintoor: అయ్యప్ప మాలతో ప్రచారం.. ముకునూరులో పాయం నాగరాజు హవా!

చింతూరు: ముకునూరులో ఎన్నికల వేడి ఒక్కసారిగా మారిపోయింది కారణం ఒక్కటే. పాయం నాగరాజు. అయ్యప్ప మాల వేసుకుని, భక్తితో, వినయంతో, చిరునవ్వుతో ప్రతి ఇంటి గడప తొక్కుతున్న నాగరాజును చూసి ఓటర్లు ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. “బాబూ. నీలాంటి యువకుడే మాకు కావాలి” అంటూ దీవిస్తున్నారు.

జనసేన తరఫున. తెలుగుదేశం సీపీఎం మద్దతుతో బరిలోకి దిగిన నాగరాజు. పంచాయతీలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని, ప్రతి ఇంటిని తిరుగుతూ సమస్యలు వింటున్నారు. “నీరు, రోడ్డు, డ్రైనేజీ. ఏ సమస్యైనా నా బాధ్యత” అంటూ భరోసా ఇస్తున్నారు.

ఆ భరోసాకే ఓటర్లు ఫిదా అవుతున్నారు.ప్రచారంలో జనసైనికులు సునామీలా దూసుకుపోతున్నారు. ప్రవీణ్ కుమార్ (కప్పు), రమణమ్మ, సతీష్ లు ఇంటింటికి వెళ్లి. “మంచం గుర్తుకు ఓటు వేయండి. మన భవిష్యత్తుకు ఓటు వేయండి” అంటూ హోరెత్తిస్తున్నారు.పెద్దల ఆశీర్వాదం. యువత కేరింతలు. మహిళల అభిమానం. అన్నీ కలిసి నాగరాజు వెంటే నడుస్తున్నాయి.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR