Chintoor: ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: సత్యవతి!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి కారం సత్యవతి ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తూ గెలుపు గాలి వీస్తోంది.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Nov 2026 12:38 PM IST
Chintoor
X

Chintoor: ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: సత్యవతి!

చింతూరు: చింతూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి కారం సత్యవతి ప్రచారంలో దూసుకుపోయారు. "ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తా" అని ఓటర్లను కోరారు. గత కొన్ని రోజులుగా గ్రామంలోని ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ఓటర్ల నుంచి విశేష స్పందన లభించినట్లు కూటమి నేతలు తెలిపారు.

గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్య పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని సత్యవతి పేర్కొన్నారు.సత్యవతిని గెలిపిస్తే చింతూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR