Chintoor: ముగిసిన ఎన్నికల ప్రచారం.. గెలుపుపై కూటమి శ్రేణుల ధీమా!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. తనను గెలిపిస్తే చింతూరును అభివృద్ధి బాటలో నడిపిస్తానని టీడీపీ బలపరిచిన అభ్యర్థి కారం సత్యవతి అన్నారు.
Chintoor: ముగిసిన ఎన్నికల ప్రచారం.. గెలుపుపై కూటమి శ్రేణుల ధీమా!
చింతూరు: గత దశాబ్దాల కాలంగా చింతూరు సర్పంచ్ గా చేసిన వారు చింతూరు ను అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపారని, తనను గెలిపిస్తే చింతూరు పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలుగుదేశం మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న కారం సత్యవతి అన్నారు.శుక్రవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో సత్యవతి గెలుపు కోసం కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు.గ్రామంలో ప్రతి వీధి... ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు.
"ఇన్నాళ్లు చింతూరుకు జరిగింది అన్యాయమే. అభివృద్ధి అంటే ఏంటో చూపించే సమయం వచ్చింది. యువత, పెద్దలు అందరూ నాకు మద్దతు తెలపాలి" అని సత్యవతి పిలుపునిచ్చారు.ప్రచార ముగింపు రోజున జనం భారీగా తరలిరావడంతో చింతూరులో సత్యవతి గెలుపుపై కూటమి శ్రేణుల్లో పూర్తి ధీమా వ్యక్తమవుతోంది.




