Chintoor: చింతూరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆప్షన్లకు నవంబర్ 3 తుది గడువు!

Chintoor: చింతూరు డివిజన్ ఫేజ్-1B నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆప్షన్లకు నవంబర్ 3 తుది గడువు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నరేంద్ర పడాల్ ప్రకటన.

RAJESH REDDY, CHINTOOR
Published on: 31 Oct 2026 3:11 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆప్షన్లకు నవంబర్ 3 తుది గడువు!

చింతూరు: చింతూరు డివిజన్ పరిధిలోని ఫేజ్-1B గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఫైనల్ డ్రాఫ్ట్ అవార్డులలో నమోదైన నిర్వాసిత కుటుంబాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు నవంబర్ 3 చివరి గడువుగా నిర్ణయించినట్లు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మరియు ఆర్ అండ్ ఆర్ అధికారి చిట్టపులి నరేంద్ర పడాల్ తెలిపారు. 1వ, 2వ, 3వ విడతల్లో నమోదైన కుటుంబాలకు ఈ అవకాశం వర్తిస్తుందని, నాన్-ఎస్టీ పీడీఎఫ్‌లకు OTS మరియు స్వీయ గృహ నిర్మాణం, ఎస్టీ పీడీఎఫ్‌లకు OTS ఆప్షన్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత లబ్ధిదారులందరూ ఈ తుది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎస్టీలకు పీసా తీర్మానం తప్పనిసరి

ఎస్టీ నిర్వాసిత కుటుంబాలు OTS ఆప్షన్ ఎంపిక చేసుకునే సమయంలో సంబంధిత పీసా గ్రామసభ తీర్మానాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

పెండింగ్ పీడీఎఫ్‌లపై రీ-ఎంక్వైరీ

ఇప్పటివరకు అనర్హులుగా గుర్తించిన మరియు కొత్తగా చేర్చాల్సిన పీడీఎఫ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్ర విచారణ నిర్వహించి, అర్హుల జాబితాను డిసెంబర్ 2026 చివరి నాటికి విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారి వెల్లడించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR