Chintoor: ముకునూరులో జనసేన హవా.. ప్రచారంలో దూసుకుపోతున్న పాయం నాగరాజు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ముకునూరు గ్రామపంచాయతీ జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ప్రణాళికాబద్ధమైన ప్రచారంతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దూసుకుపోతున్నారు.
Chintoor: ముకునూరులో జనసేన హవా.. ప్రచారంలో దూసుకుపోతున్న పాయం నాగరాజు!
చింతూరు: ముకునూరు గ్రామపంచాయతీ జనసేన సర్పంచ్ అభ్యర్థి పాయం నాగరాజు ఓ ప్రణాళిక ప్రకారంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, గెలిచిన తర్వాత ప్రతి పనిని పారదర్శకంగా చేస్తానని హామీ ఇస్తున్నారు. నాగరాజు సరళమైన మాటతీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత, మహిళలు, పెద్దలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. రోజురోజుకూ ఆయనకు మద్దతు పెరుగుతుండటంతో విజయం వైపు ఆయన ప్రయాణం వేగంగా సాగుతోందని జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.




