Chintoor: కళ్ళముందే కాలిపోయిన ఇల్లు... నిమ్మలగూడెంలో విషాదం!

Chintoor: చింతూరు మండలం నిమ్మలగూడెంలో షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు బూడిద. బాధితురాలు సోయం ముత్తమ్మ కుటుంబానికి తహసీల్దార్ తక్షణ సాయం ప్రకటన.

RAJESH REDDY, CHINTOOR
Published on: 9 Nov 2026 4:40 PM IST
Chintoor
X

Chintoor: కళ్ళముందే కాలిపోయిన ఇల్లు... నిమ్మలగూడెంలో విషాదం!

చింతూరు: చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోయం ముత్తమ్మ ఇల్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది.ముత్తమ్మ తన కుమార్తె వెంకమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి బయట ఆవరణలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా ఇంటిలో నుంచి మంటలు చెలరేగాయి.ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే... నిమిషాల వ్యవధిలోనే మంటలు ఇంటి మొత్తం వ్యాపించాయి.

తాటాకు ఇల్లు కావడంతో క్షణాల్లోనే మంటలు భగ్గుమన్నాయి. కళ్ళముందే వారి ఇల్లు బూడిదైపోయింది.మంటలు వ్యాపిస్తున్న సమయంలో చుట్టుపక్కల వారు ధైర్యం చేసి ఇంటిలోని బీరువా, గ్యాస్ బండను మాత్రమే బయటకు తీయగలిగారు. మిగిలిన సామాన్లు అన్నీ మంటల్లో కాలిపోయాయి.విషయం తెలుసుకున్న చింతూరు తాసిల్దార్ అర్జున్ రావు, ఎస్సై సంతోష్ కుమార్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.బాధితులకు తక్షణ సాయం కింద 25 కేజీల బియ్యం అందిస్తామని తాసిల్దార్ అర్జున్ రావు తెలిపారు. ప్రభుత్వం నుంచి మరింత సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇల్లు కోల్పోయిన కుటుంబం ఇప్పుడు నిరాశ్రయులైంది. వారికి అందరూ అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR