Chintoor: ఎర్రంపేటలో పూర్వీకుల సమాధుల ధ్వంసం.. అధికారులకు ఫిర్యాదు
Chintoor: చింతూరు మండలంలోని ఎర్రంపేటలో పూర్వీకుల సమాధుల ధ్వంసం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్కి గ్రామస్తుల ఫిర్యాదు.
Chintoor: ఎర్రంపేటలో పూర్వీకుల సమాధుల ధ్వంసం.. అధికారులకు ఫిర్యాదు
చింతూరు: చింతూరు-ఎర్రంపేట గ్రామాల పూర్వీకుల సమాధుల స్థలంలో జరిగిన దారుణంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రంపేట గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మధ్య ప్రదేశంలో గత 20 సంవత్సరాలుగా తమ పూర్వీకుల సమాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాడ రాంబాబు, ఉషా అరవింద బాబు తెలిపారు.
అయితే 31/10/2026 శనివారం సమాధి కార్యక్రమం నిమిత్తం వెళ్లగా అక్కడ సమాధులు కనిపించలేదని, యంత్రాలతో సమాధులను నేలమట్టం చేసి ఆనవాళ్లు లేకుండా చేశారని గ్రామస్తులు వాపోయారు.ఈ దారుణమైన చర్య తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారిపై ఎవరైనా, ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని, తమ పూర్వీకుల సమాధుల స్థలానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు సబ్-కలెక్టర్ నరేంద్ర పడాల్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం చింతూరు సిఐ గోపాలకృష్ణ ను కలిసి సమాధుల ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.




