Chintoor: చింతూరులో సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి విజయం కోరి ప్రచారం!

Chintoor: చింతూరు మండలంలో సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి మీడియం శ్రీదేవి విజయం కోరి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏవీ నాగేశ్వరరావు విస్తృత ప్రచారం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 31 Oct 2026 3:15 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీదేవి విజయం కోరి ప్రచారం!

చింతూరు: చింతూరు మండలంలో సీపీఎం పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి మీడియం శ్రీదేవిని, ఇతర సీపీఎం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఎం రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. చింతూరు మండల సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని పేదల సమస్యల కోసం సీపీఎం పార్టీ నిరంతరం పోరాడుతోందని, ఏజెన్సీలో భూ సమస్యలు, పోడు భూముల పట్టాలు, ఉపాధి హామీ, రోడ్లు, వైద్య సౌకర్యాల కొరత వంటి అంశాలపై సీపీఎం మాత్రమే నిలబడుతుందని అన్నారు.కూటమి ప్రభుత్వం ఏజెన్సీని పూర్తిగా విస్మరించిందని, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని విమర్శించారు.

అందుకే చింతూరు మండల ప్రజలంతా సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గిరిజనుల గొంతుకను జడ్పీలో వినిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR