Chintoor: తుమ్మల ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థిగా వేక సారమ్మ నామినేషన్
Chintoor: తుమ్మల ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థిగా వేక సారమ్మ నామినేషన్ దాఖలు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఎంకు ప్రజల ఆశీస్సులు ఉంటాయని పల్లపు వెంకట్ ధీమా.
Chintoor: తుమ్మల ఎంపీటీసీ సీపీఎం అభ్యర్థిగా వేక సారమ్మ నామినేషన్
చింతూరు: తుమ్మల సిపిఎం ఎంపిటిసి అభ్యర్థిగా వేక సారమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేసింది.గతంలో తుమ్మల ఎంపీటీసీ స్థానాన్ని సిపిఎం కైవసం చేసుకోవడం జరిగింది.
ఈ స్థానిక సమరంలో సైతం తుమ్మల ఎంపీటీసీ స్థానాన్ని హస్తగతం చేసుకుంటామని సిపిఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడే సిపిఎం కు తుమ్మల ప్రజలు బ్రహ్మరథం పడతారని సిపిఎం మండల కార్యదర్శి పల్లపు వెంకట్ అన్నారు. సారమ్మ గెలుపు నల్లేరు పై నడకని సిపిఎం నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు.




