Chintoor: 12 ఎంపీటీసీ స్థానాలకు కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు!
Chintoor: చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి. టీడీపీ 8, జనసేన 3, బీజేపీ 1 స్థానంలో పోటీ. అభ్యర్థుల వివరాలు వెల్లడి.
Chintoor: 12 ఎంపీటీసీ స్థానాలకు కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు!
చింతూరు: చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి సీట్ల సర్దుబాటు ఖరారు అయింది.12 ఎంపీటీసీ స్థానాలలో తెలుగుదేశం 8, జనసేన 3, బిజెపి ఒక స్థానంలో అభ్యర్థులు బరిలో దిగనున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఏడుగురాళ్లపల్లి - బత్తుల నాగమణి,చింతూరు -1 కారం లక్ష్మి, పెద్ద సీతనపల్లి - శీలం తమ్మయ్య, కల్లేరు - కరణం ముత్తయ్య, పేగ - సున్నం పార్వతి, మోతుగూడెం - పోడియం విజయకుమారి, ఏ జి కోడేర్ - కలుముల సీతయ్య లు పోటీ చేయనున్నారు.
జనసేన పార్టీ నుంచి చింతూరు - 2 మడివి రాజు, చిడుమూరు - ముచ్చిక శివ, తుమ్మల - కొవ్వసి బుల్లెమ్మ లు పోటీలో దిగనున్నారు. బిజెపి నుంచి చట్టి - సోడే వీర్రాజు పోటీ చేయనున్నారు.




