Amalapuram: అక్టోబర్ 15న చించినాడ వంతెన మూసివేత.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Amalapuram: మరమ్మతుల దృష్ట్యా అక్టోబర్ 15 ఉదయం 6 నుండి 16 ఉదయం 6 గంటల వరకు చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.

PRABHU, RAZOLE
Published on: 12 Oct 2026 2:01 PM IST
Amalapuram
X

Amalapuram: అక్టోబర్ 15న చించినాడ వంతెన మూసివేత.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

వంతెనపై రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు వాహనాల రాకపోకలు సురక్షితంగా సాగేందుకు ఈ మరమ్మతు పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. పనులను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎలాంటి వాహనాలనూ బ్రిడ్జిపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. చించినాడ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని, అసౌకర్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా చేపడుతున్న ఈ మరమ్మతు పనులకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE