Chintoor: చట్టిలో ఎంపీటీసీ కూటమి అభ్యర్థి తుర్రం వీర్రాజు ప్రచార జోరు
Chintoor: చింతూరు మండలం చట్టి ఎంపీటీసీ కూటమి బీజేపీ అభ్యర్థి తుర్రం వీర్రాజు గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ముమ్మర ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Chintoor: చట్టిలో ఎంపీటీసీ కూటమి అభ్యర్థి తుర్రం వీర్రాజు ప్రచార జోరు
చింతూరు: చింతూరు మండలం చట్టి గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. చట్టి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ-జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి తుర్రం వీర్రాజు గెలుపు కోసం కూటమి నాయకులు గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో మారుమూల గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి అందించామని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి తుర్రం వీర్రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చట్టి గ్రామ ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీఎస్ రమణారెడ్డి, టీడీపీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం ముత్తయ్య, నాయకులు తుర్రం అశోక్ కుమార్, రవ్వ సునీత, కుంజా కన్నయ్య, తుర్రం రామకోటి, విజయ్, కట్టం ముత్తయ్య, శ్యామల లక్ష్మణ్, మడివి కన్నారావు, మడివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




