Lakkaravaram: లక్కవరంలొ రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!

Lakkaravaram: కోనసీమ జిల్లా లక్కవరం గ్రామంలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ ఇంచార్జ్ అమూల్య.

PRABHU, RAZOLE
Published on: 17 Sept 2026 2:51 PM IST
Lakkaravaram
X

Lakkaravaram: లక్కవరంలొ రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!

Lakkaravaram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య శంకుస్థాపన చేశారు.

లక్కవరం వేణుగోపాల సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న వంతెన నుంచి బట్టేలంక హైస్కూల్ వరకు, ముదునూరివారి పోడు మీదుగా సుమారు 1.40 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.

ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా రహదారి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని నాయకులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, గుండుబోగుల నరసింహారావు (పెద్దకాపు), బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గుబ్బల ఫణికుమార్, ఎంపీపీ శ్రీమతి మేడిచెర్ల సత్యవాణి రాము, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మంగెన భూదేవి తదితరులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE