Malikipuram: దళితులపై దాడులకు నిరసనగా సెప్టెంబర్ 28న బీఎస్పీ ధర్నా!
Malikipuram: దళితులు, బహుజనులపై దాడులను నిరసిస్తూ సెప్టెంబర్ 28న కలెక్టరేట్ల వద్ద బీఎస్పీ ధర్నా: మలికిపురంలో గోడపత్రిక విడుదల, బత్తుల లక్ష్మణరావు పిలుపు.
Malikipuram: దళితులపై దాడులకు నిరసనగా సెప్టెంబర్ 28న బీఎస్పీ ధర్నా!
మలికిపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, బహుజనులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు బూషి జాన్ మోషే అధ్యక్షతన, రాజోలు నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు నల్లి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మలికిపురం గ్రామంలోని పూలే-అంబేడ్కర్ భవనం వద్ద ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు, బహుజనులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరసనగా నిర్వహిస్తున్న ధర్నాలో ప్రతి దళిత, బహుజనుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళితులు, బహుజనుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడ్వైజర్ ఆకుమర్తి భూషణం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జనపల్లి సత్యానందం, కోశాధికారి చవ్వాకుల వెంకట్, మలికిపురం మండల అధ్యక్షులు గుర్రం మల్లేశ్వరరావు, చుట్టుగుళ్ల దుర్గాప్రసాద్, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




