Kunavaram: కూనవరంలో టీడీపీకి భారీ షాక్.. చివరి నిమిషంలో సీన్ రివర్స్!

Kunavaram: పోలవరం జిల్లా కూనవరం ఎంపీపీ ఎన్నికల్లో గురువారం టీడీపీకి షాక్ తగిలింది. సీపీఎం మద్దతుతో ఎంపీపీగా జనసేన సోడే రమాదేవి, వైస్ ఎంపీపీగా సీతారామయ్య గెలిచారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 19 Nov 2026 6:46 PM IST
Kunavaram
X

Kunavaram: కూనవరంలో టీడీపీకి భారీ షాక్.. చివరి నిమిషంలో సీన్ రివర్స్!

కూనవరం: పోలవరం జిల్లా కూనవరం మండల పరిషత్ ఎన్నిక రాజకీయ థ్రిల్లర్‌ను తలపించింది. కూటమికి ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు.. ఎంపీపీ పీఠం మాదేనని టీడీపీ ధీమాగా ఉంది. కానీ లెక్కలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. చివరి నిమిషంలో సీపీఎం మద్దతుతో జనసేనకు చెందిన సోడే రమాదేవి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

సీపీఎం నుంచి సాయం సీతారామయ్య వైస్ ఎంపీపీగా పీఠం ఎక్కారు. ఫలితం వెల్లడికాగానే మండల కార్యాలయం వద్ద వాతావరణం వేడెక్కింది.జనసేన సభ్యులు మోసం చేశారంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. కూటమిలోనే చీలిక వచ్చిందా? తెరవెనుక ఏం జరిగింది? అన్న చర్చ ఇప్పుడు కూనవరం అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR