Gokavaram: గోకవరంలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన మాజీ సర్పంచ్!
Gokavaram: గోకవరం గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబు తన అనుచరులతో కలిసి టీడీపీని వీడి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు తోట రాంజీ సమక్షంలో వైసీపీలో చేరారు.
Gokavaram: గోకవరంలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన మాజీ సర్పంచ్!
Gokavaram: గోకవరం మండల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించామన్న ఉత్సాహంలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీకి గోకవరం గ్రామంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ మాజీ సర్పంచ్ బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మండల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయనతో 185 మంది వైసీపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడిగా బత్తుల సత్తిబాబుకు గుర్తింపు ఉంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన వంటి నాయకుడు పార్టీని వీడి వైసీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోతే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సహజమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
80 కుటుంబాలు.. 200 మంది వైసీపీ గూటికి!
గోకవరం మాజీ సర్పంచ్ బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబు తన అనుచరులు, కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి మొత్తం 60 కుటుంబాలకు చెందిన 150 మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి కుమారుడు తోట రాంజీ సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తోట రాంజీ వైసీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
సర్పంచ్ అభ్యర్థిగా బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబు!
రానున్న 29వ తేదీన జరగనున్న గోకవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, బత్తుల కుటుంబ అభిమానులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటును బత్తుల శ్రీలక్ష్మి సత్తిబాబుకు వేసి ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాలని తోట రాంజీ పిలుపునిచ్చారు.
వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
గోకవరం మండలంలో చోటుచేసుకున్న ఈ భారీ చేరికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా మాజీ సర్పంచ్ స్థాయి నాయకుడు పార్టీ మారడంతో పాటు సుమారు 150మంది వైసీపీలో చేరడం రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పరిణామం గోకవరం గ్రామ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




